బర్త్ డే రోజే సెంచరీ.. క్రికెటర్ అరుదైన రికార్డ్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ప్రతి క్రికెటర్ కూడా వరల్డ్ కప్ లో అవకాశం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇందు కోసమే జాతీయ జట్టు తరఫున ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఉంటారు. ఇలా అద్భుత ప్రదర్శన చేసి సెలెక్టర్ల చూపును ఆకర్షించి.. వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోవాలని అనుకుంటారు. అయితే వరల్డ్ కప్ లో చోటు దక్కితే.. ఇక దేశానికి వరల్డ్ కప్ గెలిపించడం కోసం క్రికెటర్లు ఎంతలా పోరాటం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే అంతర్జాతీయ క్రికెట్లో సాధారణంగా జరిగే ద్వైపాక్షిక సిరీస్ లలోనే ఒక ఆటగాడు సెంచరీ తో చెలరేగిపోయాడు.. అంటే చాలు అతని ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఏకంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వరల్డ్ కప్ లో సెంచరీ చేస్తే.. ఆ సెంచరీ ద్వారా ఎన్నో రికార్డులు బద్దలు అయితే ఇక ప్లేయర్లు మాత్రమే కాదు ప్లేయర్ల అభిమానులు కూడా ఆనందోత్సాహంలో మునిగిపోతూ ఉంటారు. అలాంటిది ఏకంగా పుట్టిన రోజు నాడే వరల్డ్ కప్ లో సెంచరీ ఫీట్ అందుకుంటే ఎలా ఉంటుంది. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించడం కూడా కష్టం. ఇక ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డు నమోదయింది.


 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ 121 పరుగులు చేసి సెంచరీ తో చెలరేగాడు. ఈ సెంచరీ వెరీ స్పెషల్. ఎందుకంటే అతని బర్త్ డే కూడా అదే రోజు కావడం విశేషం. దీంతో వరల్డ్ కప్ లో పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు మిచెల్ మార్ష్. ఇక ఈ లిస్టులో తొలి స్థానంలో న్యూజిలాండ్ క్రికెట్ రాస్ టైలర్ ఉన్నాడు. 2011 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద రాస్ టేలర్ బర్త్ డే రోజునే సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్లో ఇలా పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: