షాహిన్ కంటే బుమ్రా గ్రేట్.. పాక్ మాజీ విమర్శలు?

praveen
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ విభాగం కలిగిన టీం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ జట్టు పేరు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగం ఎలా రాణించిన జట్టు బౌలింగ్ విభాగం మాత్రం ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటుంది. అయితే ఇక 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ అదిరిపోయే ప్రదర్శన చేయడం ఖాయమని అటు అభిమానులు అందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు తురుపు ముక్కగా పిలుచుకునే షాహిన్ ఆఫ్రిది ఎన్నో రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు అభిమానులు.


 అయితే పాకిస్తాన్ జట్టులో తురుపు ముక్క అంటూ షాహిన్ ఆఫ్రిదీ ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఆ దేశ మాజీలు ఏకంగా అతనికంటే తోపు ఇంకెవరూ లేరు అని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ అదే షాహిన్ ఆఫ్రిది ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గర ప్రదర్శన చేయడం లేదు. దీంతో మొన్నటి వరకు షాహిన్ ఆఫ్రిది  అధరహో అని ప్రశంసలు కురిపించిన వారు ఇప్పుడు అతడికి అంత సీన్ లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ బౌలర్ షాకింగ్ ఇండియా బౌలర్ బుమ్రా గురించి చర్చి జరుగుతూ ఉంటుంది.


 ఇటీవల ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ సారథి వకార్ యూనిస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్తో జరిగిన పోరులో షాహిన్ పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే అయితే అతనికి అంత సీన్ లేదని అతని మునగ చెట్టు ఎక్కించారని రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇదే వ్యాఖ్యలపై వకార్ యూనిస్ స్పందించాడు.రవి శాస్త్రి చెప్పినట్లుగానే షాహీన్ ఆఫ్రిది మరో వసీం అక్రమ్ కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు  అయితే షాహిన్ ఆఫ్రిదికి పిల్లనిచ్చిన మామ షాహిద్ సైతం ఇదే విషయంపై స్పందించాడు. ఆరంభ ఓవర్లలో వికెట్ లేకపోతే షాకీర్ అసహనానికి లోనవుతాడని షాహిద్ కూడా పేర్కొనడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: