గిల్ ప్రేమపై క్లారిటీ వచ్చేసింది.. ఆ సారా ఎవరో కాదు?

frame గిల్ ప్రేమపై క్లారిటీ వచ్చేసింది.. ఆ సారా ఎవరో కాదు?

praveen
ప్రస్తుత భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్. జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన స్థానాన్ని టీంలో సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. తన అటతీరుతో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అయితే శుభమన్ గిల్. కేవలం క్రికెట్ తో మాత్రమే కాదు ప్రేమాయణంతో కూడా గత కొంతకాలం నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. శుభమన్ గిల్ సారా తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి వచ్చాయి.


 అయితే ఈ సారా ఎవరు అనే విషయంపై మాత్రం ఇప్పటికి ఒక కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే శుభమన్ గిల్ ప్రేమాయణం నడుపుతుంది క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తోనా లేకపోతే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ తోనా అనే విషయంపై సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరు స్పందించింది కానీ.. క్లారిటీ ఇచ్చింది గాని లేదు అని చెప్పాలి. అయితే యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ లవ్వాయనం  నడుపుతుంది సారా అలీఖాన్ తో కాదు సచిన్ కూతురు సారా టెండుల్కర్ తో అన్న విషయం ఇటీవలే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో క్లారిటీ వచ్చింది.

 బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ కి భారీగా ప్రేక్షకులతో పాటు కొంతమంది క్రికెట్ ప్రముఖులు కూడా వచ్చారు. ఇక ఇందులో భాగంగానే సారా టెండూల్కర్  కూడా వచ్చి క్రికెట్ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్స్ తో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సారా మ్యాచ్ మధ్యలో శుభమన్ గిల్ క్యాచ్ పట్టగానే ఎగిరి గంతేసింది. ఎంతగానో సంబరపడిపోయి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారిపోయాయి. అయితే ఇక ఇది చూసిన తర్వాత గిల్ ప్రేమాయణం నడుపుతుంది సారా అలీ ఖాన్ తో కాదు సారా టెండూల్కర్ తోనే అన్న విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: