నెదర్లాండ్స్ క్రికెటర్ పై కన్నేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. 2024 సీజన్ లో ఎంట్రీ?

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా 10 టీమ్స్ కి సంబంధించిన ఆటగాళ్లు బిజీ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ టైటిల్ గెలవడమె లక్ష్యంగా ప్రతి మ్యాచ్ లో కూడా బరిలోకి దిగుతూ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లలో ఎన్నో అరుదైన రికార్డులు కూడా ప్రస్తుతం క్రియేట్ అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే అటు అందరూ వరల్డ్ కప్ చూడటంలో బిజీగా ఉంటే ఐపీఎల్ ఫ్రాంచైజీలు  మాత్రం 2024 ఎడిషన్ లో తమ జట్టును పటిష్టంగా మార్చుకునే పనిలో ఉన్నాయి.


 ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి టైటిల్ రేసులో నిలవాలని భావించి నిరాశకు గురైన ఫ్రాంచైజీలు అన్నీ కూడా ఇక ఇప్పుడు అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని ఇక తమ టీంను పటిష్టంగా మార్చుకోవాలని ప్లాన్ వేసాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు అనే విషయాన్ని బాగా గమనిస్తూ ఉన్నాయి. ఇక మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరల్డ్ కప్ 2023లో అదరగొడుతున్న నెదర్లాండ్స్ కి చెందిన ఆల్ రౌండర్ 2024 ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.



 నెదర్లాండ్స్ ఆల్రౌండర్ బాస్ డి లీడే అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఒకవైపు బ్యాటింగ్ తో మరోవైపు బౌలింగ్ లో కూడా రాణిస్తూ ఇక ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈ ఆటగాడి పై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2024 సీజన్ కోసం ఇప్పటినుంచి అతని కోసం ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి  కొంచెం డబ్బు ఎక్కువ వెచ్చించి  అయినా సరే ఇక అతని జట్టులోకి తీసుకోవాలని పోటీపడేందుకు సిద్ధమవుతున్నాయి అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: