రేప్ కేసులో ఇరుక్కున్న క్రికెటర్ పై.. నిషేధం ఎత్తివేసిన లంక బోర్డు?
అయితే గతంలో శ్రీలంకకు చెందిన స్టార్ క్రికెటర్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక యువతి శ్రీలంక క్రికెటర్ గుణతిలక తనపై అత్యాచారం చేశాడు అంటూ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ సమయంలోనే శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం విధించింది. పోలీసులు కూడా అతని అరెస్టు చేశారు. ఇక అతను జట్టుతో పాటు స్వదేశానికి రాకుండా ఆస్ట్రేలియాలోని ఉండి కోర్టు విచారణలకు హాజరయ్యాడు. అయితే ఇటీవల అత్యాచార ఆరోపణల కేసులో గుణతిలకకు ఊరట లభించింది. కోర్టు విచారణలో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతను నిర్దోషి అన్న విషయాన్ని తేల్చింది కోర్టు.
ఈ క్రమంలోనే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ క్రికెటర్ పై శ్రీలంక క్రికెట్ బోర్డు విధించిన నిషేధాన్ని ఇటీవల ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి దీంతో అతని అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం ఆనందంలో మునిగిపోయారు. అయితే ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో.. అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక త్వరలో అతను మళ్లీ శ్రీలంక జట్టులోకి రి ఎంట్రి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీలంక జట్టు అటు వరల్డ్ కప్ లో భాగంగా పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే.