భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు.. వైజాగ్ బీచ్ రోడ్ లో బిగ్ స్క్రీన్?
దీంతో ఇలా వరల్డ్ కప్ మ్యాచ్లో జరుగుతున్న 10 వేదికలు కూడా ఎంతో అందంగా ముస్తాబయ్యాయి. అయితే ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లను అటు తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించాలని టికెట్లను కొనుగోలు చేసి రెడీగా ఉన్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా టీమ్ ఇండియా వరుసగా మ్యాచ్లతో బిజీ బిజీ అవ్వనుంది. ఏపీలో టీమిండియా ఒక మ్యాచ్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే నవంబర్ 23వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య విశాఖ వేదికగా ఒక టి20 మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.
అయితే ఈ టి20 మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఇక క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా ఈ టి20 మ్యాచ్ కోసం పటిష్టమైన ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. అయితే గత మ్యాచ్ల సందర్భంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే త్వరలోనే ఆఫ్ లైన్ లో, ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో తీసుకువస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ఇక స్టేడియం సీటింగ్ కెపాసిటీ 27,000 కాగా.. విశాఖ బీచ్ రోడ్ లో 10,000 మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా ఒక బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేస్తాము అంటూ గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి.