సమరం ముగిసింది.. ఇద్దరు కెప్టెన్లు ఏమన్నారంటే?
చిరకాల ప్రత్యర్థిపై పైచేయి సాధించి మరోసారి ఘన విజయాన్ని అందుకుంది. దీంతో వన్డే వరల్డ్ కప్ లో ఒక్కసారైనా టీమిండియా పై గెలిచి రికార్డు సృష్టించాలి అని కలలుగన్న పాకిస్తాన్ కు మరోసారి భంగపాటు తప్పలేదు అని చెప్పాలి. టీమిండియా బౌలింగ్ లో బ్యాటింగ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొన్ని వారాలుగా క్రికెట్ ప్రపంచంలో నెలకొన్న ఉత్కంఠకు ఇటీవల ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తో తెరపడింది అని చెప్పాలి. ఇకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత గెలిచిన రోహిత్ శర్మ.. ఓడిన బాబర్ స్పందన ఏంటి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపారు.
ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ తమ విజయంలో బౌలర్ల ది కీ రోల్ అంటూ కొనియాడాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించగలిగాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఓటమిపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ.. మేము ఆరంభంలో బాగానే ఆడాం.. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి మా బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. ఇదే మా ఓటమికి కారణం అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191పరుగులు చేయగా 30.2 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది టీమ్ ఇండియా. దీంతో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.