సచిన్ సెంచరీ మిస్ అయినందుకు.. సెహ్వాగ్ ఫుల్ హ్యాపీ?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమైంది. అక్టోబర్ 5వ తేదీన ఆహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్తో ప్రారంభమైన ఈ ప్రపంచ కప్ టోర్ని ప్రస్తుతం ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి. అన్ని టీమ్స్ కూడా టైటిల్ గెలవడమె లక్ష్యంగా హోరాహోరీ పోరులను సాగిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్లు అటు ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇలా ఒకవైపు అన్ని జట్ల మధ్య ఉత్కంఠ గా మ్యాచ్లు జరుగుతున్న సమయంలో.. మరోవైపు గత ప్రపంచ కప్ లకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ 2011 ప్రపంచ కప్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర ఘటన గురించి అభిమానులతో పంచుకున్నాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సచిన్ సెంచరీ మిస్ చేసుకున్నందుకు సెహ్వాగ్ ఎంతో సంతోషపడ్డాడట. అదేంటి వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో సహచరుడు సెంచరీ చేస్తే ఏ ఆటగాడు అయినా సంతోషపడతాడు. కానీ సచిన్ సెంచరీ మిస్ అయినందుకు సెహ్వాగ్ ఆనందపడటం ఏంటి అనుకుంటున్నారు కదా.



 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్  తర్వాత సచిన్ తో జరిగిన సంభాషణను సెహ్వాగ్ పంచుకున్నాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సచిన్ 85 రన్స్ చేసి అవుట్ అయ్యి డగ్ అవుట్ కు వస్తుంటే ఇద్దరం ఒకరికొకరం నవ్వుకున్నాం. అప్పుడు తాను సెంచరీ చేయనందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అనడంతో  షాకయ్య. ఎందుకంటే గతంలో ఒకానొక సమయంలో నువ్వు సెంచరీ చేసినప్పుడల్లా భారత్ గెలవడం లేదు అని సరదాగా చెప్పాను. కానీ సచిన్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు ఉన్నాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: