వరల్డ్ కప్ లో.. అతను యువరాజ్ సింగ్ లా చెలరేగుతాడు : మహమ్మద్ కైఫ్

praveen
ప్రస్తుతం భారత జట్టులో స్టార్ అలౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తాడు అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే బౌలింగ్లో, బ్యాటింగ్లో సత్తా చాటుతున్న హార్దిక్ పాండ్యా అదిరిపోయే ఫామ్ కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి  దీంతో మరోసారి సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడం ఖాయమని.. మాజీ ప్లేయర్లందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 ఇదే విషయంపై అధికారిక బ్రాడ్ కాస్టర్ తో భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఆల్ రౌండర్ గా యువరాజ్ సింగ్ పోషించిన పాత్రను ఇక ఇప్పుడు ప్రపంచకప్ లో హార్దిక్ పాండ్యా పోషిస్తాడు అంటూ మహ్మద్ కైఫ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రాక్టీస్ సెషన్ కి కూడా హార్దిక్ పాండ్య ఒక ప్రణాళికలతో వెళ్తాడు ఏ విషయంపై వర్క్ చేయాలని స్పష్టతతో నెట్ ప్రాక్టీస్ లోకి దిగుతాడు. బ్యాటింగ్ విషయంలోనూ ఇలాగే ప్రిపేర్ అవుతాడు. చివరి 10 ఓవర్లలో ఎలా ఆడాలి అనే దానిపై కూడా ప్రాక్టీస్ చేస్తాడు  అతను ఎక్కువగా స్ట్రైట్ షాట్స్ ఆడుతూ ఉంటాడు. అతని షాట్స్ చూస్తేనే అతను బందీ ప్రణాళికలతో బ్యాటింగ్ చేస్తాడు అన్నది అర్థమవుతుంది చెప్పుకొచ్చాడు మహమ్మద్ కైఫ్.

 సాధారణంగా హార్దిక్ పాండ్యా మూడు నాలుగువ స్థానాల్లో బ్యాటింగ్ చేయడం చూశాము. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ లో మాత్రం అతను ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో యువరాజ్ సింగ్ పోషించిన పాత్రను ఇక ఇప్పుడు ప్రపంచకప్లో హార్దిక్ పాండ్యా పోషించబోతున్నాడు. యువరాజ్ సింగ్ నెంబర్ సిక్స్ లో బ్యాటింగ్ చేసి పరిస్థితులకు తగ్గట్లుగా  ఆడేవాడు. బౌలింగ్ లోను రాణించేవాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా అదే చేయబోతున్నాడు  బంతితో బ్యాడ్ తో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని నెట్ ప్రాక్టీస్ సెషన్ పరిశీలించిన తర్వాతే ఈ మాట చెబుతున్న అంటూ మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: