కోహ్లీ, రోహిత్ లపై.. జయవర్థనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ప్రపంచ కప్ టోర్నీ  ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకునేందుకు అందరూ స్టార్ ప్లేయర్స్ కూడా సిద్ధమయ్యారు. అయితే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో ప్రస్తుతం ఇక భారత జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇదే విషయం గురించి ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.

 అయితే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో ఎప్పటిలాగానే ఇద్దరు ప్లేయర్లు టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరో కాదు రన్మిషన్ విరాట్ కోహ్లీ.. ఇక భారత కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ. ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండడం.. ఎక్కువ పరుగులు చేయడం.. ఇక టీమ్ ఇండియా విజయ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఇక ఇద్దరు క్రికెటర్ల గురించి శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారత్ తరపున భారీ ఇన్నింగ్స్ ఆడతారు అంటూ అభిప్రాయపడ్డాడు.


 ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్ధనే.. ఈ ప్రపంచకప్ టోర్నిలో రన్మిషన్ విరాట్ కోహ్లీ భారత్ తరఫున భారీ ఇన్నింగ్స్ ఆడతాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గుడ్ గేమ్ థింకర్ అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ బాగా ఆటను అర్థం చేసుకుంటాడు. గొప్ప కెప్టెన్లలో అతను కూడా ఒకడు. అయితే మ్యాచ్ మూమెంట్ ని బట్టి అతను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు అంటూ జయవర్తనే కామెంట్ చేశాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు తనను తాను సిద్ధం చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: