గిల్ దూరమైతే.. మొదటి మ్యాచ్ లో ఓపెనర్ ఎవరో తెలుసా?
ఏకంగా భారత జట్టులో కీలక బ్యాట్స్‌మెన్ గా కొనసాగుతున్న శుభమన్ గిల్ డెంగీ బారిన పడ్డాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలే వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. డెంగ్యూ పాజిటివ్‌గా తేలిందట. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఈనెల 8వ తేదీన జరగబోయే మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.అయితే గత కొంతకాలం నుంచి మంచి ఫామ్ కనబరుస్తున్న గిల్ ఇక ఇప్పుడు టీమిండియాలో ఉండడం ఎంతో కీలకం. అతను ఏ కారణంతోనైనా భారత జట్టుకు దూరమయ్యాడు అంటే అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి.
అయితే ప్రస్తుతం గ్రిల్ డెంగీ తో బాధపడుతున్న నేపథ్యంలో ఒకవేళ అతను ఇక టీమ్ ఇండియా ఆడబోయే మొదటి మ్యాచ్ కు దూరమైతే ఇక అతని స్థానంలో ఓపెనర్ గా బరిలోకి దిగిపోయే ఆటగాడు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అయితే గిల్ ఇక అనారోగ్యంతో దూరమైతే ఇక అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయట. అయితే దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఓపెనర్ గా ఇషాన్ కిషన్ కి కూడా మంచి రికార్డులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గిల్ డెంగీ బారిన పడటంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అతను త్వరగా కోలుకోవాలి అంటూ కోరుకుంటున్నారు.