వన్డే వరల్డ్ కప్ లో.. భారత ఆటగాళ్ల రికార్డులు ఇవే?
ఈ క్రమంలోనే ఏ టీమ్ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఇక ఆయా జట్లలో ఉన్న ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించి కూడా తమ అంచనాను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో గత వరల్డ్ కప్లలో ఆటగాళ్లు సాధించిన రికార్డుల గురించి కూడా చర్చ వస్తుంది. అయితే భారత వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో ఇప్పుడు వరకు ఈ ఫార్మాట్లో జరిగిన వరల్డ్కప్ టోర్నీలలోటీం ఇండియా ఆటగాళ్లు సాధించిన రికార్డులు ఏంటి అన్న విషయం గురించి చర్చ తెరమీదికి వచ్చింది అని చెప్పాలి.
ఆ వివరాలు చూసుకుంటే.. భారత జట్టు 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో 2011లో ధోని కెప్టెన్సీలో కప్ గెలిచింది.
ఇక వన్డే వరల్డ్ కప్లలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ 45 మ్యాచ్లతో టాప్ లో ఉన్నాడు.
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక రన్స్ 2278 పరుగులు చేసి భారత్ తరపున సచిన్ టాప్ లో ఉన్నాడు.
ఇక ఈ ఫార్మాట్లో జరిగిన వరల్డ్కప్ లో జహీర్ ఖాన్ 44 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు.
రోహిత్ శర్మ 23 సిక్సర్లతో ఈ ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్ గా ఉన్నాడు.
అత్యధిక వరల్డ్ కప్ లు ఆడిన ప్లేయర్లుగా సచిన్, జావేద్ మీయందాద్ (6) ఉన్నారు.
కెప్టెన్ గా అత్యధిక మ్యాచ్ ఆడిన ప్లేయర్లుగా అజారుద్దీన్ (23) ఉన్నాడు.
అత్యధిక క్యాచ్లు పట్టిన ప్లేయర్గా కుంబ్లే 14 టాప్ లో ఉన్నాడు.