వన్డే ఫార్మాట్.. కేవలం వరల్డ్ కప్ కే పరిమితం అవుతుంది : మార్క్
మ్యాచ్ ఫలితం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.. గంటల తరబడి టీవీలకు అతుక్కు పోవాల్సిన పనిలేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఎవరు విజేత అన్న విషయం తేలిపోతూ ఉంటుంది. అంతేకాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కావాలనుకునే బ్యాటింగ్లో మెరుపులు బౌలింగ్లో ఉరుములు అటు టి20 ఫార్మాట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. దీంతో ఇక టి20 ఫార్మాట్కు ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది అదే విధంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్ కూడా పెరిగిపోతూ ఉండడంతో ఈ పొట్టి ఫార్మాట్ క్రేజ్ ఆకాశాన్ని అంటుతూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
టి20 ఫార్మాట్ కు క్రేజ్ పెరగడం మంచిదే అయిన మిగతా ఫార్మాట్లు మాత్రం ప్రమాదంలో పడిపోతూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవల ఇదే విషయం గురించి క్రికెట్ చట్టాలను రూపొందించే.. మెరల్ బోన్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మార్క్ నికోలస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వన్డే క్రికెట్ పై అతను చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి రాబోయే కాలంలో వన్డేలు కేవలం వరల్డ్ కప్ టోర్నీకే పరిమితం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వన్డే మ్యాచ్లు జరిగే స్టేడియాలు ఖాళీగా ఉంటున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు టి20 లకు అద్వితీయమైన శక్తి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం అటు ద్వైపాక్షిక వన్డే సిరీస్ లు ఆడటం కూడా తగ్గింది అంటూ తెలిపాడు.