ఆస్ట్రేలియా ఇచ్చిన భారీ ఆఫర్ ను.. రిజక్ట్ చేసిన అశ్విన్ డూప్లికేట్?

praveen
భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అనుహ్యంగా వరల్డ్ కప్ జట్టులోకి సెలెక్ట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ముందుగా వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం బారిన పడ్డాడు.  దీంతో అతని స్థానంలో ఎంతో అనుభవజ్ఞుడైన అశ్విన్ ను సెలెక్ట్ చేస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు  ఈ క్రమంలోనే అతను భారత జట్టులోకి రావడంతో ప్రత్యర్థులు కూడా అలర్ట్ అయిపోయారు.. ఎందుకంటే అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ తో ఎలాంటి మాయ చేయగలడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.

 ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కించుకోవచ్చు అన్న విషయం అశ్విన్ కు బాగా తెలుసు. అందుకే ఇక ప్రత్యర్థి టీమ్స్ అన్నీ కూడా అశ్విన్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా అయితే ఇక సరికొత్తగా ప్లాన్స్ రెడీ చేసుకుంటూ ఉంటుంది. గతంలో అశ్విన్ తరహా లోనే పోలింగ్ చేసే ఒక యంగ్ ఇండియన్ బౌలర్ ని తమ ప్రాక్టీస్ బౌలర్గా ఎంచుకొని ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లోకి అశ్విన్ ఎంపిక కావడంతో మరోసారి ఇలాంటి ప్రణాళికనే అమలులో పెట్టాలని అనుకుందట ఆస్ట్రేలియా.

 కేవలం ఇండియాలో మాత్రమే కాదు ఏ దేశానికి వెళ్లిన ఆ దేశ జట్టు బౌలర్ల బౌలింగ్ యాక్షన్ ని పోలిన బౌలర్లతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఆస్ట్రేలియా. అయితే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వచ్చిన కంగారు జట్టు అశ్విన్ డూప్లికేటుగా పేరున మహేష్ పిథియాలను నెట్ బౌలర్ గా నియమించుకోవాలని అనుకుందట. ఇందుకోసం భారీ ఆఫర్ కూడా ఇచ్చిందట. కానీ ఈ ఆఫర్ ను మహేష్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ బరోడా క్రికెటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియాకు అందుబాటులో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: