భారత గడ్డపై.. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన పాకిస్తాన్ ప్లేయర్లు?
నేరుగా హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ జట్టు ఇక నేడు అటు న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్ ఆడింది అయితే మొదటి వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అందరి దృష్టి ఉంది అయితే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం మొదటి వార్మప్ మ్యాచ్ లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 84 బంటుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేసి అదరగొట్టాడు ఇక మిచల్ శాన్టర్ బౌలింగ్లో డారిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు అయితే బాబర్ తో పాటు మరో కీలక ఆటగాడు అయినా మహమ్మద్ రిజ్వాన్ సైతం భారత్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.
ఇలా ఇద్దరు కీలక ప్లేయర్లు హాఫ్ సెంచరీ తో చెలరేగిపోవడంతో ఇక వార్మప్ మ్యాచ్ లోనే పాకిస్తాన్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతూ ఉంది అయితే మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు అన్నది తెలుస్తుంది. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండా సజావుగా కొనసాగుతూ ఉంది అయితే భారత్ వేదికగా ఇలా పాకిస్తాన్ ప్లేయర్లు చెలరేగి పోవడంతో ప్రపంచకప్ టోర్నిలో జరగబోయే దాయాదుల పోరు మరింత ఉత్కంఠంగా మారబోతుంది అని అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు.