అప్పుడు షమి.. ఇప్పుడు అశ్విన్.. అదే తప్పు చేస్తున్న సెలెక్టర్లు?

praveen
అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో ఇక భారత జట్టుకు తిరుగు ఉండదు అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే అటు జట్టు ఎంపిక విషయంలో కూడా భారత సెలక్టర్లు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఎందుకో అటు భారత జట్టు ఎంపిక మాత్రం కొంతమంది అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.


 ఇటీవల అక్షర్ పటేల్ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో సీనియర్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకుంటూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు  అయితే గతంలో షమీ విషయంలో సెలెక్టర్లు తప్పు చేసి మూల్యం చెల్లించుకున్నారు. ఇక ఇప్పుడు అశ్విన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది అని అటు అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో బుమ్రా గాయపడటం.. ఆశలు పెట్టుకున్న దీపక్ చాహర్ కూడా గాయంతో జట్టుకు దూరమవడంతో సెలెక్టర్లు షమీని జట్టులోకి తీసుకున్నారు  అప్పటివరకు షమీ కొన్నాళ్లపాటు క్రికెట్కు దూరంగానే ఉన్నాడు.


 ఇక ఆస్ట్రేలియా తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో షమీ అద్భుతంగా రాణించాడు. ఓకే ఓవర్ లో 4 వికెట్లు పడగొట్టాడు. కానీ ప్రధాన మ్యాచ్ లలో మాత్రం షమీ పూర్తిగా తేలిపోయాడు. కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆఖరి నిమిషంలో వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అశ్విన్ ను జట్టులోకి తీసుకుంది  యాజమాన్యం. అయితే ఈ ఏడాది అశ్విన్ ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ కు ముందు ఒకటంటే ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అనుభవం ఉందన్న పేరుతో అశ్విన్ ను జట్టులోకి తీసుకున్నారు  అయితే అప్పుడు షమీ విషయంలో ఎటువంటి తప్పు చేసారో.. ఇప్పుడు అశ్విన్ విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నారు అంటూ టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: