వరల్డ్ కప్ కి ముందు.. ఇంగ్లాండ్ టీం కి భారీ షాక్?
అయితే ఇలా వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండేందుకు ఇక క్రికెటర్లు అందరికీ కూడా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడిస్తూ ఎక్కువ శాతం విశ్రాంతి ఇచ్చేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి క్రికెట్ బోర్డులు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని క్రికెట్ బోర్డులకు మాత్రం ఊహించని షాకులు తప్పడం లేదు అని చెప్పాలి. జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్నవారు జట్టుకు దూరమవుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు టైటిల్ ఫేవరెట్ గా వరల్డ్ కప్ లో బరిలోకి దిగబోయే ఇంగ్లాండ్ టీం కి కూడా ఇలాంటి షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది.
ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జేసన్ రాయ్ ప్రపంచ కప్ టోర్నీకి దూరమైనట్లు సమాచారం. వెన్ను నొప్పితో వరల్డ్ కప్ కి దూరమైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే అతని స్థానంలో యంగ్ ఆల్ రౌండర్ హ్యారి బ్రూక్ కి జట్టులో స్థానం కల్పిస్తూ ఇక ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి. మరి వరల్డ్ కప్ లో లక్కీ ఛాన్స్ దక్కించుకున్న ఈ యంగ్ ఆల్రౌండర్ ఇక తన ఆటతీరుతో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.