బాబర్ కెప్టెన్సీ పై.. గంభీర్ షాకింగ్ కామెంట్స్?

praveen
గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ వస్తున్న ఆసియా కప్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రములోనే అన్ని టీమ్స్ కూడా టైటిల్ గెలవడమె లక్ష్యంగా పోటీ పడ్డాయి. కానీ చివరికి కొన్ని టీమ్స్ మాత్రమే సక్సెస్ సాధించగలిగాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ ప్రారంభం కాకముందు నుంచే అటు భారత జట్టు ఈ టోర్నీలో ఫైనల్ వరకు చేరుకుంటుందని అందరూ అంచనా వేసుకున్నారు. అంచనా వేసుకున్నట్లుగానే టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్ లో అడుగు పెట్టింది.


 అయితే భారత్ తర్వాత ఇలా ఫైనల్ కు చేరుకుంటుంది అని క్రికెట్ ప్రేక్షకులందరూ భారీగా అంచనాలు పెట్టుకున్న టీం ఏదైనా ఉంది అంటే అది భారత దాయాది దేశమైన పాకిస్తాన్ టీమ్ అని చెప్పాలి   అయితే పాకిస్తాన్ మాత్రం అటు ప్రేక్షకుల అంచనాలను నిజం చేయలేకపోయింది. ఇటీవలే ఫైనల్లో అడుగుపెట్టాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరికి లంక టీం పై చేయి సాధించింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే బాబర్ అజాం కెప్టెన్సీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. ఇదే విషయం గురించి భారత మాజీ ఆటగాడు గౌతమ్ గాంబీర్ స్పందించాడు. ఏకంగా బాబర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించాడు. శ్రీలంకతో మ్యాచ్లో బాబర్ కెప్టెన్సీ నాకు అత్యంత సాదాసీదాగా అనిపించింది. రెండు ఫోర్లు మిడ్ ఆఫ్ మీదుగానే వెళ్లాయి. ఇక రెండు కూడా స్లో డెలివరీలే. స్లో బౌలింగ్ చేయాలనుకున్నప్పుడు.. మీడ్ ఆఫ్ ఫీల్డర్ ని లాంగ్ ఆఫ్ లో ఉంచి.. థర్డ్ మ్యాన్ ని ముందుకు తీసుకురావాలి. అలాగే కుషాల్ మొండిస్,  సమర విక్రమ మధ్య భాగస్వామ్యం కుదురుకున్నప్పుడు.. ప్రధాన బౌలర్లను తీసుకొని వికెట్లను పడగొట్టడానికి ప్రయత్నించి ఉండాల్సింది. కానీ బాబర్ ఇలాంటివి ఏమీ ప్రయత్నించలేదు అంటూ గౌతమ్ గంభీర్ విమర్శలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: