ఇండియా vs పాక్ మ్యాచ్ కోసం భారీ ప్లాన్.. కానీ స్టేడియం దొరకదే?
అయితే ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా అని ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం కాస్త వైరల్ గా మారిపోయింది. అమెరికాలోని న్యూయార్కులో హై వోల్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేసింది అయితే ఈ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చే హక్కులు వెస్టిండీస్, అమెరికాలకు దక్కింది అన్న విషయం తెలిసిందే. అయితే అసలు క్రికెట్ కి పెద్దగా ఆదరణ లేని అమెరికాలో అటు దాయాదుల పోరు కోసం కనీసం స్టేడియం దొరకని పరిస్థితి ఏర్పడిందట.
వరల్డ్ కప్ మ్యాచ్ లు నిర్వహించే క్రికెట్ వసతులు ఎక్కడా లేదు. అందులోనూ ఇక ఎక్కువ ప్రేక్షకులు హాజరయ్యే ఇండియా, పాకిస్తాన్ లాంటి హై వోల్టేజ్ మ్యాచ్కు సరిపడా స్టేడియం ఒకటి కూడా దొరకట్లేదు. వరల్డ్ కప్ కోసం మరో 9 నెలల సమయం ఉన్న ఇప్పటికి కూడా అటు పాక్ vs ఇండియా మ్యాచ్ కోసం వేదికనే గుర్తించలేదట. అయితే న్యూయార్క్ ను ఆనుకొని ఉండే బ్రాంక్స్ లో 34,000 మంది కూర్చుని మ్యాచ్ చూసే విధంగా ఒక కొత్త స్టేడియంలో నిర్మించాలని ఐసిసి ప్లాన్ వేస్తుందట. ప్రస్తుతం ఇది నిర్మాణంలో కూడా ఉంది అన్నది తెలుస్తుంది. మరి డేట్ దగ్గరికి వచ్చేసరికి ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.