కలలో కూడా అతనేనట.. వసీం అక్రమ్ ఫన్నీ కామెంట్స్?

praveen
టీం ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కి ఉన్న ఫాలోయింగ్ మనందరికీ తెలిసినదే. ప్రేక్షకులు మాత్రమే కాకుండా, విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు సైతం అతని ఆటకు ఫిదా ఐపోతున్నారు. తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులకు ఆనందాన్ని పంచుతున్న కోహ్లీ  ప్రత్యర్థులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా ఒక పాకిస్తాన్ మాజీ ప్లేయర్ కోహ్లీ పై ఫన్నీ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు ? అసలు అతను ఏమన్నాడు? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం.

వసీం అక్రమ్ పేరు అందరు వినే ఉంటారు. తాను పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెట్ ప్లేయర్. పాకిస్తాన్ టీం కు సారధ్యం కూడా వహించాడు. క్రికెట్ చరిత్రలో వన్ అఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ గా ఈయనకు పేరు. ఈయనను "సుల్తాన్ అఫ్ స్వింగ్" అని అంటారు. ఇప్పుడు ఇతను కూడా కోహ్లీ అభిమానుల జాబితాలు చేరిపోయాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తనకు కలలో కూడా కోహ్లీనే కనిపిస్తున్నదని అన్నాడు ఈ పాకిస్తాన్ ప్లేయర్.

ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒకసారి కోహ్లీ దగ్గరకు వెళ్లి నాకు నువ్వు కలలో కూడా కనిపిస్తున్నావు అని చెప్పానని దానికి అతను "ఏం అంటున్నవ్ వసీం భాయ్?" అని సరదాగా స్పందించాడని చెప్పుకొచ్చాడు. తన మెదడు లోంచి కోహ్లీని తొలగించలేకపోతున్నానని అన్నాడు వసీం అక్రమ్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వసీం అక్రమ్ 1985 లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అక్రమ్ తన కెరీర్ లో 17 మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. నాలుగు సార్లు హ్యాట్రిక్ వికెట్స్ పడగొట్టాడు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సలు బాదిన ప్లేయర్ గా వసీం అక్రమ్ రికార్డు నెల్కొలిపాడు. 1996 లో జింబాంబ్వే తో జరిగిన మ్యాచ్ లో వసీం 12 సిక్సలు బాదాడు. రిటైర్మెంట్ అనంతరం వసీం అక్రమ్ కొంతకాలం కోచ్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం కామెంటేటర్ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: