వీడియో వైరల్ : తల్లి కొంగ.. సొంత పిల్లలని చంపుకుంది?

praveen
ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించినది ఇంకొకటి లేదు అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాదు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల ఆలనా పాలన ప్రతిక్షణం చూసుకుంటూ ఇక తమ పిల్లలకు ఏ కష్టం వచ్చినా అస్సలు ఓర్చుకోలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పిల్లల కష్టాన్ని పోగొట్టేందుకు ఎంతకు తెగించటానికి  అయినా సిద్ధపడుతూ ఉంటుంది. అయితే కేవలం మనుషుల్లోనే కాదు జంతువులు పక్షుల్లో కూడా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు.



 ఏకంగా పిల్లల కోసం ప్రాణాలు అర్పించడానికి అయిన సరే తల్లి సిద్ధంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక తల్లి కొంగ ప్రవర్తించిన తీరు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పిల్లలకు కష్టం రాకుండా చూసుకోవాల్సిన తల్లి.. ఏకంగా తన ఐదుగురు పిల్లల్లో ఒక పిల్లని ఏకంగా ఎత్తున ఉన్న తన గూడు నుండి కిందికి విసిరేసి ప్రాణాలు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే అచ్చం నేటి రోజుల్లో మనుషులు ప్రవర్తిస్తున్నట్లుగానే.. ఇక ఇప్పుడు ఈ కొంగ కూడా ఏకంగా సొంత పిల్లలను చంపేందుకు కూడా వెనకడుగు వేయలేదు అని చెప్పాలి.


 ప్రస్తుతం వైరల్ గా మారిపోయినా వీడియోలో చూసుకుంటే ఒక గూడు దగ్గర కొంగతో పాటు ఐదు పిల్లలు ఉన్నాయి  అయితే ఒక పిల్ల పట్ల తల్లి కొంగు విచిత్రంగా ప్రవర్తించింది. పొడవైన ముక్కుతో పిల్ల మెడ పట్టుకుని ఎత్తైన గూడు నుంచి కిందికి విసిరేసింది. ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. టెర్రిఫైయింగ్ నేచర్ అని యూజర్ ఇక ఈ క్లిప్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.  అయితే కొంగ బలహీన పడిన పిల్లను గూడు నుంచి విసిరేసిందని శీర్షికలో పేర్కొనడం గమనార్హం. అయితే అంత ఎత్తునుంచి విసిరేయడంతో ఇక ఆ పిల్లకొంగ చనిపోయి ఉంటుంద నేటిజన్స్ కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: