యూఏఈ లో.. ఆసియా కప్ పెట్టకపోవడానికి కారణం అదే : జై షా

praveen
మొట్టమొదటిసారి ప్రస్తుతం ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా నాలుగు మ్యాచ్లు, శ్రీలంక వేదికగా తొమ్మిది మ్యాచ్ లు జరుగుతున్నాయి. కాగా పాకిస్తాన్లో జరుగుతున్న మ్యాచ్లు సజావుగానే జరుగుతున్నప్పటికీ.. శ్రీలంకలో జరగాల్సిన మ్యాచ్లకు వర్షం తరచూ అంతరాయం కలిగిస్తూనే ఉంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూసిన ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది అన్న విషయం తెలిసిందే.


 దీంతో హైబ్రిడ్ మోడల్ లో శ్రీలంక వేదికగా మ్యాచ్ లు నిర్వహించాలని భావించిన.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. యూఏఈ లో మ్యాచ్ లు ఎందుకు నిర్వహించలేదు అన్న ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో జరగాల్సిన ఆసియా కప్ 2018, వరల్డ్ కప్ 2021,  శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ 2022 టోర్నికి యూఏఈ వేదికగా మారింది. ఎలాంటి అంతరాయం లేకుండానే అక్కడ మ్యాచులు జరిగాయి అని చెప్పాలి. అయితే 2023 ఆసియా కప్ టోర్నీ కోసం యూఏఈ ని పాక్ క్రికెట్ బోర్డు ప్రస్తావించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎందుకు పట్టించుకోలేదు అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 ఇక ఇదే విషయం గురించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షులు జై షా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎసిసి ప్రెసిడెంట్ గా ఉన్న నేను అందరికీ ఆమోద్య యోగ్యమైన హైబ్రిడ్ మోడల్ తీసుకురావాలని అనుకున్నా. అందుకే పాక్ క్రికెట్ బోర్డు ప్రతిపాదన చేయగానే మేము అంగీకరించాము. పాక్ క్రికెట్ బోర్డులో కూడా మేనేజ్మెంట్ చాలా సార్లు మారింది. ఆసియా కప్ 2002 ఎడిషన్ యూఏఈ లో టి20 ఫార్మాట్లో  నిర్వహించారు. అయితే టి20 ఫార్మాట్ వన్డే ఫార్మాట్ ఒకటి కాదు. యూఏఈ లో ఉన్న వేడికి 100 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండటం అసాధ్యం అని మిగిలిన క్రికెట్ బోర్డులు  భావించాయి. అదే కాకుండా వన్డే వరల్డ్ కప్  టోర్నకి ముందు ప్లేయర్లు గాయపడే అవకాశం కూడా ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అందుకే ప్లేయర్ల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని యూఏఈ లో కాకుండా శ్రీలంకలో మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఉపఖండంలో మ్యాచ్ లు నిర్వహించడం వల్ల ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: