కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. అతన్ని పక్కన పెట్టడం బెటర్ : గవాస్కర్
అయితే ఇటీవలే ఆసియాకప్ లో భాగంగా నేపాల్ తో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం టీమిండియా ఘనవిజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సూపర్ ఫోర్లో కూడా అడుగుపెట్టింది టీం ఇండియా. ఇక ఈ కీలకమైన ఘట్టాన్ని కూడా దాటేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలోనే అటు కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు అన్న గుడ్ న్యూస్ అందింది. కానీ అతని కోసం ఎవరిపై జట్టులో వేటు వేయాలి అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరో ఒకరిని రిజర్వు బెంచ్ కు పరిమితం చేయాల్సి ఉంటుంది.
పాకిస్తాన్ తో మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ ను తప్పించే అవకాశం లేదు. దీంతో ఎవరిని తప్పించబోతున్నారు అన్నది ఎంతో చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇదే విషయంపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఫిట్నెస్ సాధించిన కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకోవాలి అంటే తప్పకుండా శ్రేయస్ ను జట్టు నుంచి పక్కన పెట్టాలి అంటూ సూచించాడు. కానీ వికెట్ కీపర్ ఇషాన్ ఉండాల్సిందే. ఇదే జరిగితే నాలుగు ఐదు స్థానాల్లో ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కి దిగే ఛాన్స్ ఉంటుంది అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.