ఈ సారి వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసేది అతనే : క్రికెట్ లెజెండ్
వివియన్ రిచర్డ్స్ అంచనా ప్రకారం రాబోయే ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసేది పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా ఆఫ్రిది. రిచర్డ్స్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ సమయంలో ఆఫ్రిది తో కలిసి కొంత సమయం గడిపానని తెలిపారు. షహీన్ షా ఆఫ్రిది ఖచ్చితంగా ఈ టోర్నీలో విజృంభిస్తాడని అన్నారు రిచర్డ్స్. షహీన్ షా ఆఫ్రిది ఇప్పటివరకు 52 అంతర్జాతీయ టి 20 మ్యాచ్లు ఆడి 64 వికెట్లు, 27 టెస్ట్ మ్యాచ్లు ఆడి 105 వికెట్లు, 39 వన్ డే మ్యాచ్లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు. ఈమధ్య ఆఫ్గనిస్తాన్ తో జరిగిన వన్ డే సిరీస్ లో 6 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ టేకర్ గా నిలిచాడు.
ఇక బాటింగ్ విషయానికొస్తే ఈ ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ కు చెందిన స్టార్ బ్యాటర్ జోష్ బట్లర్ టాప్ స్కోరర్ గా నిలుస్తాడని అంచనా వేశారు సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ జాక్ కలీస్. బట్లర్ అస్సలు ప్రెషర్ తీసుకోకుండా ఆడుతాడని, ఇండియన్ పిచ్ ల పైన అతనికి అవగాహన ఉందని అన్నారు కలీస్.