పాపం టీమ్ ఇండియాలో.. అత్యంత దురదృష్టవంతుడు ఇతడేనేమో?

praveen
టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ అదృష్టం కూడా అలాగే కలిసి రావాలి. అప్పుడే సరైన అవకాశాలు వస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు. అయితే ఇది కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు ఏ రంగానికైనా వర్తిస్తుంది అని చెప్పాలి. అయితే టీమిండియాలో కూడా ఒక ఆటగాడి విషయంలో ఇది నిజమే అని తెలుస్తుంది. ఎందుకంటే అతనికి చాలానే టాలెంట్ ఉంది. తెలివైన స్పిన్నర్ అనే ఒక టాగ్ కూడా ఉంది. ఇక టీమ్ ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ లోను అతను కనిపిస్తాడు. కానీ విచిత్రంగా ఇక ఐసిసి టోర్నీలు అంటే అతని పక్కన పెట్టేస్తారు.


 మేజర్ టోర్నిలు అనగానే అతడి ప్రతిభ పాఠవాలు సెలక్టర్లకు ఎందుకో పెద్దగా సంతృప్తికరంగా ఉండవు. ఇక ఈసారి కూడా అదే జరిగింది. ఈ నెల 30వ తేదీ నుంచి జరగబోయే ఆసియా కప్ విషయంలోనూ చాహల్ కు మొండి చేయి ఎదురయింది. జట్టులో చోటు దక్కలేదు. సొంతగడ్డపై అక్టోబర్ 5వ తేదీన వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుండగా అంతకు ముందు ఈ నెల 30వ తేదీ నుంచి ఆసియా కప్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ జట్టులో చాహుల్ కు చోటు దక్కలేదు. జట్టు సమతూకంగా ఉండేందుకే చాహల్ ను పక్కన పెట్టామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పారు.



 అతని స్థానంలో అక్షర్ పటేల్ ను ఎంపిక చేసామని చాహల్తో పోల్చి చూస్తే అక్షర్ పటేల్ కు బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జట్టులో చోటు లేదని ఆందోళన అవసరం లేదని.. ప్రపంచ కప్ లో అతనికి తప్పకుండా చోటు దక్కుతుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే గతంలో 2021 t20 ప్రపంచ కప్ సమయంలో కూడా చోటు దక్కలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అదటి స్థానంలో ఏమాత్రం అనుభవం లేని వరుణ్ చక్రవర్తికి జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. 2022 టి20 వరల్డ్ కప్ లో అతని సెలెక్ట్ చేసిన బెంచ్ కి పరిమితం చేశారు. అయితే చానల్ నైపుణ్యం కలిగిన ఆటగాడని.. ఒకవేళ అతన్ని తీసుకుంటే ఇండియాకు మంచి ఆప్షన్ అవుతాడని ఇక ఆసియా కప్ కు సెలెక్ట్ చేయకపోవడంపై చాహల్ స్నేహితుడు డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: