అలా చేసినందుకు.. క్రికెటర్ గా సిగ్గుతో తలదించుకున్నా : గంభీర్

praveen
టీమిండియా డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అతని ఆట తీరుతో అతనే ఎంతోమందికి సుపరిచితుడుగా మారిపోవడమే కాదు అందరినీ అభిమానులుగా మార్చుకున్నాడు. టీమిండియా ఓపెనర్ గా అతను ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. అయితే ధోని సారథ్యంలో  టీమిండియా రెండు వరల్డ్ కప్ లు గెలిస్తే ఇక ఈ రెండు వరల్డ్ కప్లలోనూ గౌతమ్ గంభీర్ ఓపెనర్ గా  కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడి జట్టున గెలిపించాడు.

 అయితే ఇలా తన ఆటతీరుతో ఎంతలా గుర్తింపును సంపాదించుకున్నాడో ఇక తన కోపంతో అంతే వివాదాల్లో ఇరుక్కున్నాడు గౌతమ్ గంభీర్. దూకుడు అనే పదానికి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే గౌతమ్ గంభీర్ ఇక ఎంతటి ఆటగాడిని అయినా లెక్కచేయడు. ఎప్పుడూ సూటిగా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇలాంటి స్వభావంతో ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నాడు. అయితే ఎంతటి ప్రత్యర్ధులు ఎదురైనా తలవంచకుండా పోరాటం చేసే గౌతమ్ గంభీర్ క్రికెటర్ గా ఒక పని చేసినందుకు మాత్రం సిగ్గుతో తలదించుకున్న అంటూ ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 ఐపీఎల్ 2014 సీజన్లో వరుసగా మూడుసార్లు డక్ అవుట్ అవ్వడంతో తర్వాత మ్యాచ్లో ఓపెనర్ గా బరిలోకి దిగేందుకు భయపడ్డాను అంటూ గౌతమ్ పేరు తెలిపాడు. ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే ధైర్యం లేక మనీష్ పాండేను ఓపెనర్ గా పంపించాను అన్న విషయాన్ని ఇటీవలో ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేశాడు. అయితే మనీష్ పాండే కూడా ఆ మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడని ఇక ఆ మ్యాచ్ లో ఫస్ట్ డౌన్ లో వెళ్ళిన తాను ఒకే ఒక పరుగు చేసి వెనుతిరిగాను అంటూ తెలిపాడు. ఇక ఆ క్షణం ఎంతగానో పశ్చాత్తాపానికి గురయ్యాను. సిగ్గుతో తలదించుకున్నాను అంటూ గౌతమ్ గంభీర్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: