ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.. కానీ కెప్టెన్ అయ్యాడు?

praveen
చైనా వేదికగా ఆసియా గేమ్స్ జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆసియా గేమ్స్ లో భాగంగా వన్డే క్రికెట్ టోర్ని కూడా జరగబోతుంది. ఈ క్రమంలోనే అటు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఆసియా గేమ్స్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఇప్పటికే ఆసియా గేమ్స్ కు వెళ్లబోయే జట్టును కూడా ప్రకటించాయ్. ఈ క్రమంలోనే బీసీసీఐ ఇక ఈ టీంలో అటు యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేసింది. అయితే ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం ఆసియా క్రీడలకు 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ప్రకటించింది.


 అయితే అన్ క్యాప్డ్ ప్లేయర్ యువ ఆల్రౌండర్ కాసిం అక్రమ్ కు ఏకంగా పాకిస్తాన్  కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా ఆసియా గేమ్స్ జరగబోతున్నాయ్. అయితే ఇండియా వేదికగా వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆసియా గేమ్స్ కోసం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టుకు పాక్ ఏకంగా యంగ్ ప్లేయర్ కాసిం అక్రమ కు కెప్టెన్సీ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.


 అయితే ఇప్పుడు వరకు అతను ఒక్కసారి కూడా అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. కానీ 20 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ కు దేశవాళి క్రికెట్లో మాత్రం అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్నాడు  ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంట్రల్ పంజాబ్ జట్టు తరఫున అక్రమ ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20 మ్యాచ్ లు ఆడిన ఈ ఆల్ రౌండర్ 27 వికెట్లతో పాటు 960 పరుగులు సాధించాడు. ఇక లిస్టు ఏ క్రికెట్లో 45 మ్యాచ్లు ఆడి 35.27 తో 1305 పరుగులు సాధించాడు. ఇక అండర్ 19 ప్రపంచకప్ 2021- 2022 లో కూడా పాక్ జట్టుకు కెప్టెన్ గా అతని వ్యవహరించాడు. కెప్టెన్ గా ఆకట్టుకోవడమే కాదు అటు వ్యక్తిగత ప్రదర్శనతో కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 లో విజేతగా పాకిస్తాన్ నిలపడంలో అతను కీలక పాత్ర వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: