త్రుటిలో తప్పించుకున్న బుమ్రా.. లేదంటే మళ్లీ గాయం అయ్యేది?

praveen
భారత జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా వెనునొప్పి గాయం కారణంగా దాదాపు గత 11 నెలల నుంచి టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం చూపించడం కోసం సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పై ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇటీవలే మళ్లీ ఫిట్నెస్ సాధించి ఇక ఫామ్ లోకి కూడా వచ్చేసాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా మరోసారి బుమ్రా టీమిండియా జెర్సీ ధరించాడు అన్న విషయం తెలిసిందే  అయితే ఐర్లాండ్ పర్యటనలో అటు కెప్టెన్ గా కూడా ఆకట్టుకున్నాడు.



 ఇక మొదటి మ్యాచ్ లోనే బుమ్రాకు మంచి శుభారంభం లభించింది. మధ్యలో వర్షం ఆటంకం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఏకంగా రెండు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది  అయితే ఈ మ్యాచ్ లో మొదటి ఓవర్ లోనే బుమ్రా రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు అని చెప్పాలి. అయితే ఇక బుమ్రా మంచి ఫామ్ కనబరచడంతో వరల్డ్ కప్ లో అతనికి చోటు ఖాయమని ఇక టీమిండియా బౌలింగ్ విభాగం పటిష్టంగా మారుతుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఇక మొదటి టీ20 మ్యాచ్ లో బుమ్రా ఒక ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు.



 టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 14 ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యతను వాషింగ్టన్ సుందర్ కు   ఇచ్చాడు కెప్టెన్ బుమ్రా. ఇక ఆ ఓవర్ లోనే ఐదవ బంతి ఐర్లాండ్ ఆటగాడు బౌండరీకి తరలించాడు. అయితే రవి బిష్ణయ్ బుమ్రా ఇద్దరు కూడా బంతిని బౌండరీ లైన్ దాటకుండా అడ్డుకునేందుకు పరుగులు పెట్టారు. అయితే రవి  బ్యాక్ వర్డ్ స్క్వేర్ లేక్ నుండి పరిగెత్తి బంతిని అడ్డుకోవడానికి డైవ్ చేశాడు. ఇక అదే సమయంలో బుమ్రా అక్కడికి వచ్చాడు. అయితే బౌండరీ లైన్ వద్ద బుమ్రాకు రవి  అడ్డు రావడంతో ఒక్కసారిగా బౌండరీ లైన్ మీద నుంచి ఎగిరి దుకాడు బుమ్రా. ఈ సమయంలో ఏ మాత్రం అటు ఇటు బుమ్రాకు గాయం అయనా మళ్లీ జట్టుకు దూరమయ్యేవాడు. కానీ ఎలాంటి గాయం కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: