కోహ్లీకి డైమండ్ బ్యాట్ గిఫ్ట్.. ఇచ్చింది ఎవరో తెలుసా?
ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టి అటు వరల్డ్ క్రికెట్లో రికార్డుల కింగ్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. అంతే కాదు. అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి 15 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఇంకా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాడిలాగా ఏదో నిరూపించుకోవాలి అన్న కసి అతనిలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక కోహ్లీలో ఉండే ఇలాంటి స్వభావమే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ అందరిని అతనికి అభిమానులుగా మార్చేసింది. ఇక మైదానంలో కోహ్లీ ఎంతో దూకుడుగా ఉండే విధానం కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేస్తూ ఉంటుంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని ఒక్కసారి కలిసిన చాలు అని అభిమానులు తెగ ఆశపడుతూ ఉంటారు. ఇక అభిమానుల నుంచి కోహ్లీకి ఎన్నో రకాల బహుమతులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వచ్చిన బహుమతి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఏకంగా ఒక డైమండ్ బ్యాట్ ని కోహ్లీ అభిమాని బహుమతిగా పంపించాలని అనుకుంటున్నాడట. సూరత్ కు చెందిన వ్యాపారి ఉత్పల్ మిస్త్రి అనే వ్యక్తి కోహ్లీ కి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. ఏకంగా 1.04 క్యారెట్ డైమండ్ బ్యాట్ ను విరాట్ కోహ్లీ కి బహుమతిగా ఇవ్వాలి అనుకుంటున్నానని.. దీని విలువ ఏకంగా 10 లక్షల వరకు ఉంటుందని సదరు అభిమాని చెప్పుకొచ్చాడు.