బుమ్రా బ్యాక్.. బుల్లెట్ లాంటి బంతులు విసురుతున్నాడు?

praveen
బుమ్రా..ఈ డెత్ బౌలర్ స్పెషలిస్ట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో సార్లు కీలక సమయాల్లో తన బౌలింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. డెత్ ఓవర్లు వేయడంలో బుమ్రా స్పెషలిస్ట్. చివరి ఓవర్లలో అద్భుతమైన యార్కర్ లు వేసి బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెడుతుంటాడు. అయితే గత కొన్ని నెలలుగా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కానీ తిరిగి అదే వేగంతో మళ్ళీ వెనక్కి వచ్చాడు బుమ్రా. టీంఇండియా ఐర్లాండ్ సిరీస్ కు సిద్ధమైంది. ఈ సిరీస్ లో సీనియర్ ప్లేయర్ లు గాయాల నుంచి కోలుకొని మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆగస్ట్‌ 18, 20, 23 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌ కోసం భారత్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. దీనికి సంబందించిన ఒక వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో బుమ్రా నెట్స్ లో బౌలింగ్ వేస్తూ కనిపించాడు. అంతేకాదు మరింత పేస్ ని కూడా జోడించి నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నాడు. బుమ్రా వేసే బంతులకి బ్యాట్స్ మెన్ వణికిపోయారు. వాళ్ళ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఐర్లాండ్ జట్టే కదా అని ఇండియా తేలికగా తీసుకోవడం లేదు. మొన్న జరిగిన వెస్ట్ ఇండీస్ సిరీస్ లో ఇండియాకు విండీస్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి టీంఇండియా తేలికగా తీసుకోవడం లేదు. అన్ని విభాగాల్లో రాణించాలని ప్రాక్టీస్ చేస్తుంది. ఈ వీడియోలో బుమ్రా పేస్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా రోజుల తరువాత బంతిని పట్టుకున్న బుమ్రా ముందు కంటే ఎక్కువ పేస్ ఉపయోగిస్తున్నాడు. దీంతో టీంఇండియా జట్టు చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు బుమ్రా కోసం ఒక కాప్షన్ కూడా పెట్టింది. మనందరం ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది.. అతని గురించి అందరికీ తెలిసిందే అంటూ క్యాప్షన్‌ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

బుమ్రా మాత్రమే కాదు నెట్స్ లో సీనియర్స్ ప్లేయర్స్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసారు. ఆక్సిడెంట్ తరువాత రిషబ్ పంత్ కూడా మొదటిసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. సీనియర్ ప్లేయర్లు మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. బుమ్రా, అయ్యర్, రాహుల్ వన్డే వరల్డ్ కప్ లోపు ఫుల్ ఫామ్ అందుకొని ఈసారి టీంఇండియాకు ఈసారి కప్ అందించాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: