తిలక్, జైశ్వాల్ బ్యాటింగే కాదు.. బౌలింగ్ కూడా చేస్తారట తెలుసా?
ఇలా ఇప్పటికే దేశవాళి క్రికెట్లో అదరగొట్టి ఇక ఇప్పుడు భారత జట్టు తరుపున కూడా సూపర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న ప్లేయర్లలో తిలక్ వర్మ, యశస్వి జైష్వాల్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ రాజస్థాన్ రాయల్స్ తరఫున యశస్వి జైస్వాల్ సూపర్ ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ చాన్స్ దక్కించుకున్నారు. ఇక వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్గా బరిలోకి దిగుతున్న ఇద్దరు యంగ్ స్టర్స్ అదరగొడుతున్నారు అని చెప్పాలి. దీంతో వీరిద్దరే భారత్ క్రికెట్ ను ముందుకు నడిపించే ఫ్యూచర్ సూపర్ స్టార్లు అని భారత క్రికెట్ ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే ఇద్దరు సెన్సేషనల్ బ్యాట్స్మెన్ ల గురించి భారత జట్టు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆసక్తికర విషయాన్ని చెప్పి అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. విండిస్ పర్యటనలో అదరగొడుతున్న తిలక్ వర్మ, జైశ్వాల్ లు బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్ కూడా చేయగలరు అంటూ బౌలింగ్ కోచ్ ఫరాస్ మాంబ్రే వెల్లడించాడు. త్వరలోనే వారు జట్టు తరఫున బౌలింగ్ చేస్తారని కనీసం ఒక్క ఓవర్ అయినా వేస్తారని చెప్పుకొచ్చాడు. అండర్ 19 క్రికెట్లో వారి ప్రతిభను దగ్గర నుంచి చూసామని.. ఇక జట్టులో ఆల్రౌండర్లు ఉండడం శుభసూచికం అంటూ పారస్ మాంబ్రే చెప్పుకొచ్చాడు.