31 ఏళ్ళ తర్వాత.. స్పెషల్ మ్యాచ్ ఆడబోతున్న టీమిండియా?

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్ని గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. అయితే అయితే ఇటీవలే ముందుగా విడుదల చేసిన షెడ్యూల్లో పలుమార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తో పాటు మరో తొమ్మిది మ్యాచ్లను కూడా షెడ్యూల్ మార్చింది.


 ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్ లోనే నరేంద్ర మోడీ  స్టేడియంలో అక్టోబర్ 15వ తేదీన జరగాల్సి ఉండగా.  ఒకరోజు ముందుగానే ఈ మ్యాచ్ నిర్వహించేందుకు నిర్ణయించింది. అయితే నవంబర్ 11న జరగాల్సిన నెదర్లాండ్స్ తో మ్యాచ్ ను నవంబర్ 12 కు మార్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తో 31 ఏళ్ళ తర్వాత ఒక స్పెషల్ డే రోజున టీమిండియా బరిలోకి దిగిపోతుంది. నవంబర్ 12వ తేదీన దీపావళి పండుగ అన్న విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజున టీమిండియా తరచుగా క్రికెట్ ఆడదు.


 కానీ ఇక నవంబర్ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్ 12వ తేదీకి మార్పు చేయడంతో  అదే రోజు దీపావళి కావడంతో ఇక నెదర్లాండ్స్ తో మ్యాచ్ ద్వారా ఒక స్పెషల్ డే రోజు అటు టీమ్ ఇండియా మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. భారత క్రికెట్ చరిత్రలో ఇలా కేవలం రెండు సార్లు మాత్రమే జరిగింది. దీపావళి పండుగ నాడు భారత క్రికెట్ జట్టు 1987 ప్రపంచ కప్ సందర్భంగా మొదటి మ్యాచ్ ఆడింది.. అదే సమయంలో 1992లో దీపావళి పండుగ రోజున టీమిండియా చివరిసారిగా జింబాబ్వేతో మ్యాచ్ ఆడింది. ఈ రెండు సార్లు భారత జట్టు విజయం సాధించింది  ఇక ఇప్పుడు ఈ స్పెషల్ డే రోజున మూడోసారి బరిలోకి దిగబోతుంది టీం ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: