అతను మా టీమ్ లో ఉండటం.. నిజంగా మా అదృష్టం : హార్దిక్

praveen
టీం ఇండియా ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ తో టీ20 సిరీస్ లో పాల్గొంటోంది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇండియా మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. కానీ మళ్ళీ పుంజుకున్న టీం ఇండియా... గయానా వేదికగా జరిగిన మూడో టీ20 లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాట్టింగ్ గు దిగిన వెస్ట్ ఇండీస్, 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన భారత్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ లు జైస్వాల్ (2 ), గిల్ (6 ), అవుట్ అయ్యారు. కానీ తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ చెలరేగిపోయారు. సూర్య కుమార్ (83), తిలక్ వర్మ (49) పరుగులతో అద్భుతంగా ఆడారు. చివర్లో బ్యాట్టింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్య అద్భుతమైన సిక్సర్తో మ్యాచ్ ను ముగించాడు.
ఈ మ్యాచ్ లో నెగ్గి భారత్ సిరీస్ విజయ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిపోయినా ఇండియా, ఈ మ్యాచ్ కూడా ఓడిపోయి ఉంటె, సిరీస్ చేజారి ఉండేది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈ విజయం తనకు చాలా కీలకం అన్నాడు. రెండు మ్యాచ్ లు ఓడిపోవడం వల్లనో, లేక రెండు మ్యాచ్ లు గెలవడం వల్లనో మారేదేమీ లేదని, అందరు ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఆడుతున్నారని అన్నాడు. బౌలింగ్ లో చేసిన మార్పుల గురించి వివరించాడు హార్దిక్ పాండ్య.
ఇండియన్ టీంలో 8వ స్థానంలో బ్యాట్టింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరని, అందుకే బ్యాటర్లు పరుగులు చేస్తే 8వ స్థానంలో బ్యాట్టింగ్ చేసేవాళ్ళు అవసరం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో  సూర్య కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ.... తిలక్, సూర్యల పార్టనర్ షిప్  చాలా బాగుంది. వాళ్లిదరు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకొని ఆడుతారని అన్నాడు. సూర్య వంటి ప్లేయర్ తన టీం లో ఉండటం తన అదృష్టమని, అతనికి ఛాలెంజ్ అంటే ఇష్టమని, సూర్య వలన టీంలో అందరికి కాంఫిడెన్స్ పెరుగుతుందని కితాబిచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: