మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ.. ఇప్పుడు కొత్త అవతారం?

praveen
భారత చీఫ్ సెలెక్టర్ గా ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన చేతన్ శర్మ భారత ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీసీసీఐ లోలోపల ఎలాంటి పనులు చేస్తున్నారు అన్న విషయాన్ని బహిర్గతం చేసి అందరిని అవాక్కయ్యేలా చేశాడు చేతన్ శర్మ. ఏకంగా టీమిండియా ప్లేయర్లు ఫిట్నెస్ టెస్టులో పాస్ అవడం కోసం ప్రత్యేకమైన ఇంజక్షన్లు వాడుతూ ఉంటారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే డోపింగ్ టెస్టులో మాత్రం ఇవి దొరకవు అంటూ చేతన్ చర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి.


 ఈ క్రమంలోనే ఇలా కొన్ని ఇంటర్వ్యూలలో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు భారత్ క్రికెట్ ను ఊపేసాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై చర్యలు తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా సిద్ధమైంది. కానీ అంతకుముందే చేతన్ చర్మ చీఫ్ సెలెక్టర్  పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అయితే చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇక ఆ పదవి ఎన్నో రోజులపాటు ఖాళీగానే ఉంది. ఇలా గతంలో తన కామెంట్స్ తో సంచలన వివాదానికి తెరలేపిన చేతన్ శర్మ ఇక ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు అనేది తెలుస్తుంది.


 మొన్నటి వరకు చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉన్న చేతన్ శర్మ.. ఇక ఇప్పుడు ఏకంగా క్రికెట్ వ్యాఖ్యాతగా మారబోతున్నాడు అని తెలుస్తుంది. ఇటీవల ఏకంగా కామెంట్రీ చేస్తున్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు చేతన్ శర్మ. ఇక ఈ ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా చేతన్ శర్మ రాజీనామా తర్వాత చీఫ్ సెలెక్టర్ పదవి కొన్నాళ్లపాటు ఖాళీగా ఉండగా.. ఇటీవల భారత మాజీ ఆటగాడు అజిత్ అగర్కర్ కు ఆ పదవి బాధ్యతలు అప్పగిస్తూ  బిసిసిఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: