పంత్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బ్యాటింగ్ మొదలెట్టేసాడు?
అయితే మంచి క్రమశిక్షణ చూపించిన పంత్.. వైద్యులు ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుంటున్నాడు. ప్రమాదం జరిగిన ఎనిమిది నెలల్లోనే నెట్స్ లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీలో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వస్తున్న బంతులను కూడా ఎంతో చక్కగా ఎదుర్కొంటున్నాడట. ఈ విషయాన్ని నేషనల్ క్రికెట్ అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంకా పూర్తిగా రీ ఎంట్రీ ఇచ్చేంత ఫిట్నెస్ సాధించలేదని వైద్యులు చెబుతున్నారు. అయితే పంత్ పట్టుదలతో వేగంగా కోల్పోవడం చూసి అటు వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారట.
అతని క్రమశిక్షణ పట్టుదల చూస్తుంటే వైద్యులు ఊహించిన దాని కంటే అతి తక్కువ సమయంలోనే మళ్ళీ అతను టీమిండియా జట్టులోకి వచ్చేలాగే కనిపిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే రిషబ్ కోసం ప్రత్యేకంగా ఎన్సీఏ ఒక రికవరీ షెడ్యూల్ ని కూడా తయారు చేసిందట ఇక ఇప్పుడు అతను వేగంగా కోలుకుంటున్న క్రమంలో కొత్త టార్గెట్తో మరో కొత్త షెడ్యూల్ ఏర్పాటు చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. అయితే పంత్ వేగంగా కోరుకుంటున్నాడు. 140 కిలోమీటర్ల వేగంతో వస్తున్న బంతులు ఎదుర్కొంటున్నాడు. తన రికవరీ చూసి సంతోషంగా ఉంది. రికవరీలో ఎదురయ్యే ప్రతి హార్దిల్ ను అధిగమిస్తున్నాడు ఇంకొన్ని వేగవంతమైన మూమెంట్లపై ఫోకస్ పెట్టి మరి కొన్ని నెలలు దీనిపైన పనిచేస్తామంటూ ఎన్సీఏ వర్గాలు తెలిపాయి.