టీమిండియాలోకి రావడమే కాదు.. నా అసలు గోల్ అదే : తిలక్ వర్మ
వెస్టిండీస్ పర్యటన లో భాగంగా టీమ్ ఇండియా ఆడుతున్న టి20 సిరీస్‌లో అతను అవకాశం దక్కించుకున్నాడు. అయితే వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలమైన సమయంలో తిలక్ వర్మ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజు లోకి వచ్చిన అతను బ్యాట్ తో మెరిసాడు. 22 బంతుల్లో 39 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక సిక్సర్ తోనే తన పరుగుల ఖాతాను తెరిచాడు అని చెప్పాలి. కాగా అతను 177 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం గమనార్హం.
ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలోకి రావడం కాదు.. తన అసలు గోల్ ఏంటి అన్న విషయాన్ని ఇటీవల తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. టీమిండియా కు ప్రాతినిధ్యం వహిస్తూ వన్డే, టి20 ప్రపంచ కప్ లను గెలవటమే తన ముందున్న అసలు లక్ష్యం అంటూ ఈ హైదరాబాద్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనకు వచ్చిన ఫ్యూచర్ స్టార్ బిరుదు పై కూడా స్పందించాడు. భవిష్యత్తు స్థార్ అని అందరూ తనను అంటుంటే ఎంతో ఆనందంగా ఉందని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం క్రికెట్ పైనే ఉంది అని తెలిపాడు. కాగా వెస్టిండీస్ పర్యటన అనంతరం ఐర్లాండ్‌తో జరిగే టి20 సిరీస్ లో కూడా తిలక్ వర్మ ఆడబోతున్నాడు.