వారెవ్వా.. తెలుగోడా మజాకా.. సూపర్ క్యాచ్ పట్టాడు?

praveen
ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ టూర్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసినదే. ఇప్పటికే టెస్ట్, వన్ డే సిరీస్ లలో విజయం సాధించిన టీం ఇండియా, ప్రస్తుతం టీ 20 సిరీస్ లో పాల్గొంటోంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదట బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్ట్ ఇండీస్ చాహల్ వేసిన నాలుగోవ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తరువాత కాస్త పుంజుకున్నట్టు కనిపించిన వెస్ట్ ఇండీస్ ని మల్లి తన క్యాచ్ తో దెబ్బతీసాడు తిలక్ వర్మ.

కుల్దీప్ యాదవ్ వేసిన ఎడొవ ఓవర్లో బ్యాట్టింగ్ చేస్తున్నాడు జాన్సన్ చార్ల్స్. డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసాడు చార్ల్స్. బంతి చాలాసేపు గాలిలో తేలుతూ ఉంది. ఆ సమయంలో డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ వెంటనే అలెర్ట్ అయ్యి సుమారు 15 మీటర్లు ఎడమవైపుకు వేగంగా పరుగెత్తి డైవ్ చేసి క్యాచ్ ను అందుకున్నాడు. ఈ క్యాచ్ అందుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.

దీంతో వెస్ట్ ఇండీస్ ఎనిమిది ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన పూరన్, పావెల్ మంచి ప్రదర్శన చేయడంతో వెస్ట్ ఇండిస్ 20 ఓవర్లకు 149 పరుగులు చేసింది. తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన టీం ఇండియా 20  ఓవర్లకు 145 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. అద్భుతమైన క్యాచ్ అందుకోవడమే కాకుండా 22 బంతుల్లో 39 పరుగులు ( 3 సిక్సులు, 2 ఫోరులు) చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు తిలక్ వర్మ. ఐ పి ఎల్ లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన తిలక్ వర్మకు ఇదే మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్. తిలక్ వర్మ స్వస్థలం హైద్రాబాద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: