అలాంటప్పుడు.. కోహ్లీ, రోహిత్ ను ఎందుకు పంపించారు?
ఈసారి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా పై భారీగానే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి టీమ్ ఇండియాకు అందని ద్రాక్షలా మారిపోయిన వరల్డ్ కప్ ఈసారి టీమిండియా తప్పకుండా గెలుస్తుందని అటు భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక ఆటగాళ్లతో వీలైనంత ఎక్కువ వన్డే మ్యాచ్ లు ఆడించాలని ఇండియా యాజమాన్యం కూడా భావిస్తూ ఉంది.
ఇలాంటి సమయంలో ఇటీవల వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి కీలకమైన ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటించడంతో విమర్శలు వచ్చాయి. ఇక ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ కోహ్లీలకు ఎందుకు రెస్ట్ ఇచ్చారో తనకైతే అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు. డబ్ల్యుటిసి పైనల్ తర్వాత వారికి నెలరోజులు విశ్రాంతి దొరికిందని.. ఎక్కువ మ్యాచ్‌లు కూడా ఆడలేదని గుర్తు చేశాడు. అయితే ఈ సిరీస్ కు ప్రాధాన్యత లేదు అని భావిస్తే ఇక వారిని ఎందుకు వెస్టిండీస్ పర్యటనకు పంపించారు అంటూ ప్రశ్నించాడు. కాగా ఈ ఇద్దరు కీలక ప్లేయర్లు లేని రెండో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి చవి చూసింది.