ధోని ఫ్యాన్స్ కి.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సాక్షి?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆయన సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఇటీవలే ఒక సినిమాను నిర్మించారు. లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమాను నిర్మించగా.. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ధోని నిర్మాతగా మారినప్పటికీ కూడా అటు మీడియాకు దూరంగానే ఉన్నారు. కాగా ధోని భార్య సాక్షి ఇక ప్రమోషన్స్ బాధ్యతలను తీసుకొని  ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ ప్రమోషన్స్ ద్వారా ఇక సాక్షి అటు సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన  ధోని సతీమణి సాక్షి ఏకంగా మహి అభిమానులందరికీ కూడా ఒక పండగ లాంటి న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది. కాగా టోర్నీ జరుగుతున్న సమయంలోనే ధోని మోకాలికి గాయమైంది. కానీ గాయం బెడద వేదిస్తున్న జట్టు కోసం ఆట కొనసాగించాడు ధోని.

 ఐపీఎల్ ముగిసిన వెంటనే మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ధోని గాయం గురించి అప్డేట్ మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే అతని రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందంటూ వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో అటు ధోని సతీమణి సాక్షి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఇంటర్వ్యూలో భాగంగా ధోని ఆరోగ్యం గురించి ప్రశ్న ఎదురవ్వగా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది సాక్షి. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ప్రస్తుతం కోలుకుంటున్న ధోని వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ కూడా కూడా రెడీ అవుతాడు అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: