టెస్ట్ సిరీస్‌లో లాగానే వన్డేల్లో కూడా టీం
ఇండియా శుభారంభం ఇచ్చింది. అందుకు తగ్గ ఫలితం అనుకున్నట్లే వచ్చింది. కానీ 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోవడం మాత్రం షాకింగ్ విషయం.ఇక ఈ నేపథ్యంలో టీం
ఇండియా బ్యాటింగ్ విభాగానికి రెండో వన్డే పరీక్షగా నిలవబోతోంది. ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో టీం
ఇండియా బరిలోకి దిగుతోంది.కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో మొత్తం 5 వికెట్ల విజయంతో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన మన టీమ్ఇండియా.. అదే వేదికలో సిరీస్ విజయమే లక్ష్యంగా శనివారం నాడు రెండో వన్డేలో పోటీలోకి దిగుతోంది. బౌలర్లు బాగా రాణించడంతో మొదటి మ్యాచ్‌లో సునాయాసంగా గెలిచేసిన టీమ్ఇండియాకు బ్యాటర్ల తడబాటు మాత్రం ఇంకా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. రెండో వన్డేల్లో ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని టీం
ఇండియా చూస్తోంది. టెస్టుల్లో లాగానే వన్డేలో కూడా బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యాన్ని కొనసాగించడంతో మరో ఓటమిని ఖాతాలో వేసుకున్న విండీస్.. ఈ సిరీస్‌ను కాపాడుకోవడానికి ఏమాత్రం బాగా పోరాడుతుందన్నది చూడాలి.
ఫస్ట్ వన్డేలో లక్ష్యం చిన్నది కావడంతో బ్యాటింగ్ ఆర్డర్‌ను
మార్చి చూసిన టీం ఇండియాకి కొంతమేర చేదు అనుభవమే మిగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానాన్ని ఇషాన్ కిషన్‌కు ఇచ్చి ఏడో స్థానంలో ఆడటం జరిగింది మొత్తం 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఏడో నంబర్ ఆటగాడు బ్యాటింగ్‌కు దిగాల్సి రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. పిచ్ బౌలర్లకు అనుకూలించినా కానీ ప్రస్తుత విండీస్ టీం మీద బ్యాటర్లు ఇలాంటి ప్రదర్శన చేయడం కొంత ఆందోళన కలిగించే విషయం. ఇక ఇషాన్ కిషన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నా కూడా టెస్టు సిరీస్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ శుభ్‌మన్ గిల్ (7) విఫలమయ్యాడు. విరాట్
కోహ్లీ బదులు మూడో స్థానంలో ఆడిన సూర్యకుమార్ (19) మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్నాడు. హార్దిక్ పాండ్య (5) తేలిపోయాడు. ఆ మ్యాచ్‌లో
విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు రాలేదు.ఇక చిన్న లక్ష్యం కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చిన రోహిత్, ద్రవిడ్.. సెకండ్ వన్డేలో మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే అదే ఆర్డర్‌ను కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, లక్ష్యాన్ని ఛేదించినా.. బ్యాటర్లు రేంజ్ కి తగ్గ ప్రదర్శన చేయాల్సిందే.