ఇక్కడికి ఎందుకు వచ్చావని.. ద్రావిడ్ నన్ను అడిగాడు : జితేష్ శర్మ

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఎంతోమంది ప్లేయర్లు  తమ ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఇలా గుర్తింపు సంపాదించుకున్న వారు ఆ తర్వాత కాలంలో భారత జట్టులోకి అరంగేట్రం చేశారు అని చెప్పాలి. ఇలా ఐపీఎల్లో గుర్తింపు సంపాదించుకున్న ప్లేయర్లలో.. జితేష్ శర్మ కూడా ఒకరు అని చెప్పాలి. ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఈ ఆటగాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో అయితే 10 ఇన్నింగ్స్ లలో 234 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్.


 ఇక పదహారవ ఎడిషన్ లో 14 ఇన్నింగ్స్ లలో 39 పరుగులు చేసి ఇక పంజాబ్ విజయాలలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో తనకు చాన్స్ దక్కుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. అయితే ఇప్పటికే ఒకసారి టీం ఇండియాకు ఎంపిక అయ్యాడు జితేష్ శర్మ. అయితే టీమిండియా కు ఎంపీ కావాలి అన్న కోరిక అయితే తీరింది. కానీ ఇక జట్టు తరఫున అరంగేట్రం చేయాలి అన్న కోరిక మాత్రం అతనికి తీరలేదు. ఎందుకంటే అతనికి తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు అని చెప్పాలి. అయితే ఇటీవల ఆసియా గేమ్స్ రూపంలో అతనికి అదృష్టం కలిసి వచ్చింది.


 ఈ క్రమంలోనే ఇటీవలే మీడియాతో మాట్లాడిన జితేష్ శర్మ కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. జితేష్.. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావో తెలుసా అంటూ తనను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అడిగాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాహుల్ ద్రావిడ్ అడిగిన ప్రశ్నకు నేను ఇలా బదులిచ్చాను. వీలైనంత ఎక్కువగా స్ట్రైక్ రేట్ నమోదు చేయడం నా బలం. త్వరత్వరగా పరుగులు రాబడుతున్న.. అందుకే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అంటూ సమాధానం చెప్పాను. అప్పుడు అవును నువ్వు ఇక్కడికి వచ్చింది అందుకే.. జట్టు కోసం ఆడు.. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకునే అవకాశం ఉంటుంది అంటూ ద్రావిడ్ చెప్పారని జితేష్ శర్మ గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: