పాపం.. ఎంత ఆడితేనేం.. అంతా వర్షార్పణం?
ఏకంగా సిరీస్ లో విజయం సాధిస్తే వరల్డ్ కప్ గెలిచాము అన్నట్లుగా సంబరపడిపోతూ ఉంటారు ఆయా జట్ల ఆటగాళ్లు, అభిమానులు. ఇలా అంతలా యాషెష్ సిరీస్ ని గౌరవంగా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అందుకే ఎప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య సిరీస్ జరిగిన కూడా ఇక ఉత్కంఠ మరో లెవెల్ లో ఉంటుంది కాగా ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ మధ్య ఇదే సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న సిరీస్ లో అటు ఆతిథ్య ఆసీస్ జట్టు అదరగొట్టింది అని చెప్పాలి. ఏకంగా మొదటి రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. కానీ తర్వాత అనూహ్యంగా ఇంగ్లాండ్ జట్టు పుంజుకుంది.
మూడో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి. అయితే ఇక నాలుగో మ్యాచ్లో ఇక ఇంగ్లాండ్ దూకుడైన అటు తీరు చూస్తే తప్పకుండా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. సిరీస్ సమం చేస్తుందని భావించారు. కానీ ఊహించని రీతిలో అటు ఇంగ్లాండ్కు వరునుడి రూపంలో ఆటంకం ఏర్పడింది. దీంతో నాలుగో టెస్ట్ డ్రాగ ముగిసింది. కాగా ఇంగ్లాండుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చివరి రెండు రోజులు ఆట వర్షార్పణం కావడంతో చివరికి మ్యాచ్ డ్రాగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్లు గెలవగా.. ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగ ముగుసింది. కాగా ఐదవ మ్యాచ్ ఈ నెల 27వ తేదీన జరగనుంది.