టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ అరుదైన ఘనతని సాధించాడు. ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ధోనిని కూడా ఈజీగా అధిగమించాడు.ఇప్పటి దాకా అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ శర్మ పరుగుల సంఖ్య మొత్తం 17,298కి చేరింది. ఇప్పటి దాకా ఇండియా తరఫున 443 మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 42.92 సగటుతో ఈ పరుగులని చేశాడు. అతని ఖాతాలో మొత్తం 44 సెంచరీలు, 92 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇక అత్యుత్తమ స్కోరు 264. వెస్టిండీస్ తో తొలి టెస్ట్ లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ రెండో టెస్టులో కూడా 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ధోనీ మొత్తం 535 మ్యాచ్ లలో 17092 రన్స్ చేశాడు. ధోనీ తన కెరీర్లో మొత్తం 15సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు చేశాడు. బెస్ట్ స్కోరు 224 గా ఉంది.ఇక టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఐదో స్థానానికి చేరుకున్నాడు.
విండీస్‌తో రెండో టెస్టులో 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తాజా వాటితో కలిపి కెప్టెన్‌గా రోహిత్ ఇప్పటి దాకా మొత్తం 150 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు మోర్గాన్(233 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉండగా.. 211 సిక్సర్లతో ధోని రెండో స్థానంలో, రికీ పాంటింగ్ 171 సిక్సర్లతో మూడో స్థానంలో ఇంకా 170 సిక్సర్లతో మెక్‌కల్లమ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి మొత్తం 138 సిక్సర్లతో రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే వన్డే ఫార్మాట్‌లో మొత్తం 243 వన్డేల్లో 9825 రన్స్ చేశాడు. సగటు 48.63 కాగా.. 30 సెంచరీలు ఇంకా 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని బెస్ట్ స్కోరు 264. ఇక టెస్టుల్లో మొత్తం 52 మ్యాచ్ లలో 3620 రన్స్ చేశాడు. సగటు 46.41 కాగా.. 10 సెంచరీలు ఇంకా 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 212 గా ఉంది. రోహిత్ శర్మ తన కెరీర్లో 148 టి20లు ఆడి 3853 రన్స్ చేశాడు. సగటు 31.32 కాగా.. నాలుగు సెంచరీలు ఇంకా 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 118 గా ఉంది.