టీమిండియా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బుమ్రా వచ్చేస్తున్నాడు?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద  తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలకమైన ప్లేయర్స్ లేకుండానే ఐసీసీ టోర్నీలలో ఆడుతుంది భారత జట్టు. దీంతో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు కూడా ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ఇలా గత కొన్ని నెలల నుంచి కూడా అటు భారత జట్టుకు దూరమైన కీలక ప్లేయర్లలో బుమ్రా కూడా ఒకడు. టీమ్ ఇండియాలో పేస్ గుర్రం గా పేరు సంపాదించుకున్న బుమ్రా.. ఇక ఇప్పుడూ జట్టు విజయాలలో కీలక పాత్ర వహించేవాడు.


తన ఫేస్ బౌలింగ్తో ప్రత్యర్థులను భయపెడుతూ ఇక టీమిండియాను విజయపతంలో నడిపించేవాడు. అంతే కాదు ఇక జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతూ ఉండేవాడు అని చెప్పాలి. బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు అంటే టీమిండియా గెలుస్తుంది అని అభిమానులు కూడా గట్టిగానే నమ్మేవారు. కానీ ఆ తర్వాత కాలంలో వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మళ్ళి కోలుకొని జట్టులోకి వచ్చిన ఒకే మ్యాచ్లో మళ్లీ పాత గాయం తిరగబెట్టడంతో జట్టుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా బుమ్రా కీలకమైన టోర్నీలకు అందుబాటులో లేకుండానే పోయాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సర్జరీ అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు.


 అయితే వన్డే వరల్డ్ కప్ నాటికి బుమ్రా జట్టులోకి అందుబాటులోకి వస్తాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు. క్రమక్రమంగా ఓవర్ల సంఖ్యను పెంచుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ మేరకు ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాడు బుమ్రా. కమిట్ హోం అంటూ ఒక వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ నాటికి బుమ్రా అందుబాటులోకి రావాలని ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: