ఇండియా vs పాక్ మ్యాచ్.. మనోళ్లు దుమ్ముదులిపేశారు?

praveen
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఎంతలా ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతూ ఉన్నాయి ఈ రెండు జట్లు. అయితే కేవలం క్రికెట్లో మాత్రమే కాదు సరిహద్దుల వద్ద కూడా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉన్న నేపథ్యంలో.. ఇక క్రికెట్లో కూడా ఈ రెండు జట్లు తలబడినప్పుడల్లా క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటుంది. నరాల తెగే ఉత్కంట మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఇక ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంటుంది అని చెప్పాలీ.


 కాగా ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ లో కూడా అటు పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ చూసే అవకాశం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా దొరికింది. ఈ క్రమంలోనే ఈ దాయాదుల పోరు కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారూ అని చెప్పాలి. అయితే ఇక ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు ప్రారంభానికి ముందు ఇక ఇప్పుడు కాస్త ముందుగానే  ఏకంగా పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ చూసే అవకాశాన్ని దక్కించుకున్నారు క్రికెట్ ప్రేక్షకులు. ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా ఇండియా ఏ, పాకిస్తాన్ ఏ జట్ల మధ్య ఇటీవలే మ్యాచ్ జరిగింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ దాయాదులు పోరుకి కొలంబో ఆతిథ్యం ఇచ్చింది. కొలంబో వేదికగా మ్యాచ్ హోరా హోరిగా జరిగింది. స్టార్ స్పోర్ట్స్ లో ఇక ఈ మ్యాచ్ ని ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. కాగా భారత ఏ జట్టుకు కెప్టెన్గా యష్ దుల్ వ్యవహరించాడు. ఇక ఈ టీంలో సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, జూరెల్, రాజవర్ధన్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యంగ్ టాలెంటెడ్ క్రికెటర్లు భాగం అయ్యార. ఇలా టాలెంటెడ్ క్రికెటర్లతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా అదరగొట్టింది. మొదట బ్యాట్టింగ్ చేసిన పాక్ 205/8 పరుగులు చేయగా.. ఇండియా 36.4 ఓవర్ల లోనే టార్గెట్ చేధించింది. దీంతో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: