8 ఏళ్లు ఆ జట్టుకు ఆడా.. కానీ.. RCB పై చాహల్ విమర్శలు?
ఐపీఎల్ లోకి కొత్తగా గుజరాత్, లక్నో జట్లు ఎంట్రీ ఇవ్వడంతో అన్ని టీమ్స్ కూడా తమ జట్టులో ఉన్న ప్లేయర్స్ ని వదులుకొని ఇక వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ ఏకంగా జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న వారిని సైతం వదులుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఇలా ఎనిమిదేళ్లపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన సేవలు చేసిన చాహాల్ ను కూడా ఇక ఆ టీం యాజమాన్యం మెగా వేలం సమయంలో పక్కన పెట్టేసింది.
దీంతో ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు అని చెప్పాలి. కాదుకాగా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు యాజమాన్యంపై బౌలర్ ఛానల్ విమర్శలు గుర్తించాడు. ఆ టీం కోసం ఎనిమిదేళ్లలో దాదాపు 140 మ్యాచులు ఆడినప్పటికీ వారితో ఎప్పుడు సరైన కమ్యూనికేషన్ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక టాక్ షోలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు చాహల్. నన్ను వదులుకున్న తర్వాత తిరిగి మళ్ళీ తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ తర్వాత పరిస్థితులు చూసి కోపం వచ్చింది. ఏది ఏమైనా నాకు చిన్నస్వామి స్టేడియం అంటే ఇష్టం అంటూ చాహాల్ చెప్పుకొచ్చారు.