బీసీసీఐ హింట్ ఇచ్చింది.. ఇక ఆ సీనియర్ ప్లేయర్ కెరియర్ ముగిసినట్లేనా?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అని చెప్పాలి. ఐపిఎల్ సహా దేశవాళి లీగ్ ద్వారా ఎంతో మంది యంగ్ క్రికెటర్లు సత్తా చాటుతూ తెరమీదికి  వస్తున్నారు. తామే టీం ఇండియా ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని తమ ఆట తీరుతో నిరూపిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లు తెరమీదకి వస్తున్న నేపథ్యంలో అటు ప్రస్తుతం భారత జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్స్ కెరియర్ ప్రమాదంలో పడిపోతుంది. ఏమాత్రం ఒక్క మ్యాచ్లో వైఫల్యం చెందిన కూడా అటు సెలక్టర్లు  సీనియర్లను పక్కన పెట్టడం విషయంలో నిర్మొహమాటంగా ఉంటున్నారు.


 ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సీనియర్ ప్లేయర్స్ కెరియర్ ప్రమాదంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక టీమిండియా కు ఓపెనర్ గా ఎన్నో ఏళ్లపాటు సేవలందించిన ధావన్ కెరియర్ కూడా ఇలా ప్రమాదంలో పడిపోయిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అవును అని సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మూడు ఫార్మాట్ల ప్లేయర్ గా ఉండేవాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే పరిమితం చేశారు. ఇక కెప్టెన్సీ కూడా అప్పగించారు. దీంతో వన్డే వరల్డ్ కప్ లో అతని సెలెక్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు.


 కానీ ఆ తర్వాత కాలంలో వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పించారు. అయితే ఆసియా గేమ్స్ ఆడేందుకు వెళ్లబోతున్న టీమ్ ఇండియాకు కెప్టెన్ గా అతని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా యంగ్ ప్లేయర్ రుతురాజు గైక్వాడ్ కి సారథ్యం అందించింది బీసీసీఐ. కనీసం ధావన్  కి జట్టులో చోటు కూడా కల్పించలేదు. దీంతో ఈ సీనియర్ ఓపెనర్ ఫ్యాన్స్ అందరూ నిరాశలో మునిగిపోయారు. ఇక ఆసియా గేమ్స్ కి కూడా సెలెక్ట్ చేయలేదంటే ధావన్ కెరియర్ ముగిసినట్లే అంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: