మొన్నే టీమిండియాలోకి వచ్చాడు.. అంతలోనే జైస్వాల్ సొంతింటి కల నెరవేరింది?
దేశవాలీ క్రికెట్, ఐపీఎల్ అయితే ఓకే గాని అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఏ ఆటగాడు అయినా కాస్త ఒత్తిడికి గురవుతాడు అని అందరూ అంటుంటారు. కానీ యశస్వి జైష్వాల్ విషయంలో మాత్రం ఇది అబద్ధం అని తేలింది. ఎందుకంటే దేశ వాలీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో ఎలా అయితే సెంచరీల మోత మోగించాడో ఇక అంతర్జాతీయ క్రికెట్ లో కూడా మొదటి మ్యాచ్ లోనే ఇలా తన మార్కు చూపించాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన యశస్వి జైష్వాల్ సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి.
అయితే ఎన్నో కష్టాలు పడి ఇప్పుడిప్పుడే క్రికెటర్ గా నిలదొక్కుకుంటున్న యశస్వి జైష్వాల్.. ఇక ఇటీవల తన సొంతింటి కలను సహకారం చేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. యశస్వి జైష్వాల్ కుటుంబం ఇటీవల 2 బెడ్ రూమ్ ఫ్లాట్ నుంచి ఫైవ్ బెడ్ రూమ్ ఫ్లాట్ కి మారినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇలా జైస్వాల్ కి సొంతింటి కోరిక ఉండేదని అతని సోదరుడు మీడియాకు చెప్పారు. ఇక కొడుకు విజయం కోసం అతని తండ్రి కాలినడకన యూపీ నుంచి ఉత్తరాఖండ్ కి వెళ్లి ఆలయంలో పూజలు చేసినట్లు తెలిపారు. కాగా ఈ యంగ్ క్రికెటర్ సొంతింటి కల నెరవేరడంతో ఇక ఇప్పుడు అభిమానులు కూడా అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు అని చెప్పాలి.