వరల్డ్ కప్ కీ క్వాలిఫై కాలేదని.. ఐర్లాండ్ కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
అయితే ఇప్పటికే ఎనిమిది జట్లు వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు నేరుగా అర్హత సాధించాయి.. కానీ మరో రెండు స్థానాల కోసం అటు కొన్ని జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే క్వాలిఫైయర్ మ్యాచ్ లలో సత్తా చాటిన శ్రీలంక అటు వరల్డ్ కప్ కోసం అర్హత సాధించిన మొదటి టీం గా నిలిచింది అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయ్యే రెండో టీం ఏది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో ఇప్పటికీ కొన్ని జట్లు ఇక వరుస పరాజయాలతో చివరికి వరల్డ్ కప్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ను కూడా కోల్పోయిన పరిస్థితి కనిపించింది.
ఇలా ఇప్పటికే ఐర్లాండ్ వరల్డ్ కప్ రేస్ నుంచి తప్పుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐర్లాండ్ కెప్టెన్ గా ఉన్న ఆండ్రూ బల్బీర్ ని ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తమ జట్టు వరల్డ్ కప్ కు క్వాలిఫై కాకపోవడంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు బాల్బీర్ని. అయితే నేపాల్ తో జరిగిన మ్యాచ్ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు అని చెప్పాలి. దీంతో ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తాత్కాలిక కెప్టెన్ గా స్టెర్లింగ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా బల్బీర్ ని మూడు ఫార్మాట్లలో 89 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు.