రోహిత్, కోహ్లీలను.. ఇక ఆ ఫార్మాట్లో చూడటం కష్టమేనా?
పొట్టి ఫార్మాట్ అంటే కుర్రాళ్లకు సంబంధించిన ఆట అని అందులో సీనియర్లను సెలెక్ట్ చేయకుండా యువకులకే పెద్ద పీట వేయాలి అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. కానీ ఇంకా సెలక్టర్లు సీనియర్ క్రికెటర్లను ఎందుకు టి20 ఫార్మాట్ లోకి తీసుకుంటున్నారు అంటూ విమర్శలు రావడంతో.. సెలెక్టర్లు కూడా తమ వైఖరి మార్చుకున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఐపీఎల్లో గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ ను మొదట తాత్కాలిక కెప్టెన్ గా నియమించగా.. ఇక ఇప్పుడు టి20 ఫార్మాట్ కి అతన్ని పర్మినెంట్ కెప్టెన్ గా మార్చేశారు అనేది తెలుస్తుంది.
ఎందుకంటే గత కొంతకాలం నుంచి టీమిండియా ఆడే ప్రతి టి20 సిరీస్ లో కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గానే బరిలోకి దిగుతుంది. ఇక సీనియర్ ప్లేయర్లను పక్కనపెట్టి టీ20 టీంలో యంగ్ ప్లేయర్స్ కి అవకాశం ఇస్తున్నారూ. వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కూడా సీనియర్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పై వేటు వేశారు సెలక్టర్లు. దీంతో ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లను.. మళ్లీ టి20 ఫార్మాట్లో చూడటం కష్టమే అని అందరూ భావిస్తున్నారు. అయితే 2024 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని అవకాశాలు ఇవ్వాలని మాజీలు సూచిస్తున్న వేళ సెలెక్టర్లు కూడా అదే దారిలో వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో రోహిత్, విరాట్ కోహ్లీలను వన్డే, టెస్టులకే పరిమితం చేసే అవకాశం ఉంది.